గాంధీ విగ్రహం వద్ద సోనియా, రాహుల్ నిరసన

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఇవాళ పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కర్ణాటక, గోవాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలు చేస్తుందని, అందుకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఆ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ వారు ఈ నిరసన చేపట్టారు.

Latest Updates