థాంక్స్ రాయ్‌బరేలీ : సొంత సెగ్మెంట్‌లో సోనియా గాంధీ

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలో పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి రాయ్ బరేలికి వచ్చిన సోనియాకు… కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు స్వాగతం పలికారు.

సోనియాతో పాటు రాయ్ బరేలీకి చేరుకున్నారు ఆమె కూతురు, ఎన్నికల్లో పూర్వాంచల్ ఇంచార్జ్ ప్రియాంకగాంధీ. పర్యటనలో భాగంగా అక్కడి లీడర్లతో సమావేశం అవుతారు సోనియాగాంధీ. అటు పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీ.. యూపీకి చెందిన 42 లోక్ సభ నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు.

Latest Updates