తల్లి శవం మీద నగలు తీసుకున్న క‌న్నబిడ్డ‌లు.. కరోన సాకుతో శవాన్ని వదిలేసిపోయారు

గుంటూరు జిల్లా: న‌గ‌ల మీద ఉన్న మ‌మ‌కారం క‌నిపెంచిన‌ సొంత త‌ల్లిపై చూపించ‌లేదు. క‌రోనాతో త‌న త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలియ‌గానే ఫ‌స్ట్ ఆమెపై ఉన్న బంగారాన్ని తీసుకున్న క‌న్న బిడ్డ‌లు.. ఆ త‌ర్వాత అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి మొహం చాటేశారు. ఈ దారుణ సంఘ‌ట‌న గుంటూరు జిల్లా మాచ‌ర్ల మండ‌లంలో జ‌రిగింది. ‌ మాచర్ల మండలానికి చెందిన ఓ వృద్ధురాలు ఇటీవల మనుమరాలి వద్దకు వచ్చింది.

శ్వాస సమస్యతో బాధ‌ప‌డుతున్న ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. వృద్ధురాలికి కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు, చేతికి ఉంగరాలు తీసుకెళ్లిన వారు.. అంత్యక్రియల గురించి అధికారులు, పోలీసులు అడిగినా సోమవారం సాయంత్రం వరకూ పట్టించుకోలేదు. వారు ఫోన్లు స్విఛ్చాఫ్‌ చేయడంతో అధికారులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు.

Latest Updates