బిడ్డలు కనికరించక నడివీధిన పడ్డ వృద్ధ దంపతులు

కొడుకులు పట్టించుకోవడం లేదని కూతురింటికి వెళ్లిన ఆ ముసలి దంపతులని అల్లుడు కూడా కనికరించకపోవడంతో నడి వీధిన పడ్డారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ కు చెందిన నరసయ్య, లచ్చమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వయసు పైబడిన వారిద్దరిని ఇద్దరు కొడుకులూ.. చేరదీయకపోవడంతో ఊళ్లోనే ఉంటున్న కూతురింటికి వెళ్లారు. కూతురింట్లోనే పదేళ్లుగా ఉంటూ స్వయంగా వండుకు తింటున్న వారితో..  నిన్న రాత్రి అల్లుడు గొడవ పడి  ఇల్లు ఖాళీ చేయించాడు. గత్యంతరం లేక రాత్రి నుంచి ఆ ఊరి గుళ్లో తలదాచుకున్నారు. ఈ ఉదయం వారి పరిస్థితిని చూసి స్థానికులు కొడుకులకు సమాచారం అందించారు. వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆ వృద్ధ దంపతులని చూసి జాలి పడుతున్నారు.

Latest Updates