దేశ‌ వ్యాప్తంగా ‘కలియుగ కర్ణుడు’ సోనూసూద్ స్కాలర్ షిప్ లు..అప్ల‌యి చేసుకోండిలా

సినిమాల్లో అతను కరుడు కట్టిన విలన్. కానీ నిజ జీవితంలో అసలు సిసలైన రియల్ హీరో. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవుడు. అతడే సోనూసూద్.
ఓ వైపు క‌రోనా విజృంభిస్తుంటూ పేద‌ల్ని, వ‌ల‌స కూలీల్ని కాపాడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

తాజాగా దేశ‌వ్యాప్తంగా ఉన్న పేద విద్యార్ధుల‌కు స్కాల‌ర్ షిప్ ను అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సోనుసూద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా, నిరుపేదలు తమ పిల్లల చదువు కోసం ఎలా కష్టపడుతున్నారో నేను చూశాను. కొంతమందికి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి ఫోన్లు లేవు, మరికొందరికి ఫీజు చెల్లించడానికి డబ్బు లేవు. కాబట్టి నేను నా తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతో స్కాలర్‌షిప్‌లను అందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను.

పంజాబ్ లో త‌న త‌ల్లి స‌రోజ్ సూద్ ఉచితంగా విద్య‌ను అందించారు. ఆమె చేసిన ప‌నిని ఇప్పుడు నేను చేయాల‌ని అనుకుంటున్నాను. ఇదే మంచి స‌మ‌యం
వార్షిక ఆదాయం రూ .2 లక్షల కన్నా తక్కువ ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్ధులు స్కాల‌ర్ షిప్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే ఓ షరతు విధించారు.
అక‌డ‌మిక్ లో మంచి రికార్డ్ ఉండాలి. అలా ఉంటే విద్యార్ధులు స్కాల‌ర్ షిప్ కు అప్ల‌యి చేసుకోవాల‌న్నారు. స్కాల‌ర్ షిప్ పొందిన విద్యార్ధుల‌కు ఖ‌ర్చులు ,కోర్సు ఫీజులు, హాస్టల్ వసతి, ఆహారం ఇలా ప్ర‌తీది తాము ద‌గ్గ‌రుండి చూసుకుంటామ‌ని తెలిపారు.

ద‌ర‌ఖాస్తుల‌ను scholarships@sonusood.me మెయిల్‌కు 10 రోజుల్లో పంపించాల‌ని సోనూసూద్ తెలిపారు. కాగా, సోనూసూద్ ప్ర‌క‌టన‌పై నెటిజ‌న్లు జేజేలు పలుకుతున్నారు.

Latest Updates