ఫిట్‌‌‌నెస్‌‌లో నాకు పోటీదారుడు దొరికాడు: సోనూ సూద్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ టైమ్‌లో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంలో నటుడు సోనూ సూద్ విశేష కృషి చేసిన విషయం తెలిసిందే. లాక్‌‌డౌన్ తర్వాత కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ సోనూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు. ఈ విషయాన్ని పక్కనబెడితే సోనూ కొడుకు ఎషాన్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఎషాన్‌‌తో తాను దిగిన ఓ పాత ఫొటోను ఇన్‌‌స్టాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో సోనూను ఇమిటేట్ చేస్తూ చిన్నప్పటి ఎషాన్ పోజ్ ఇచ్చాడు. ఈ ఫొటోకు ‘హ్యాపీ బర్త్ డే నా హీరో ఎషాన్ సూద్. మొత్తానికి నాకు ఫిట్‌‌నెస్‌‌లో పోటీనిచ్చే వారు దొరికారు’ అని క్యాప్షన్ జత చేశాడు. దీంతో పాటు ఎషాన్‌‌తో తాను ఫిట్‌‌నెస్ చేస్తున్న రీసెంట్ ఫొటోలు, వీడియోలను సోనూ పంచుకున్నాడు.

Latest Updates