ప్లేస్టేషన్‌ కొనివ్వమని పిల్లాడి ట్వీట్.. సోనూ సూద్ సూపర్ రిప్లయ్

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో వలస కూలీలకు సాయం చేయడంతో ప్రముఖ నటుడు సోనూ సూద్ పేరు దేశమంతా మార్మోగింది. వలస కూలీలకు ఆహారం అందించడంతోపాటు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేసి చాలా మంది హృదయాలను సోనూ దోచుకున్నాడు. రీసెంట్‌గా ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్‌‌ను కొనిచ్చాడు. ఇలా తన సేవలతో, గొప్ప మనసుతో సోషల్ మీడియాలో సోనూ మంచి క్రేజ్ సంపాదించాడు.

తాజాగా మరోసారి సోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన తోటి పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకుంటూ లాక్‌డౌన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారని, తనకూ ఓ పీఎస్‌4 (ప్లేస్టేషన్) కొనివ్వాలని సోనూను ట్విట్టర్‌‌లో ఒక పిల్లాడు కోరాడు. నీలేశ్ నింబోరే అనే సదరు పిల్లాడి ట్వీట్‌కు స్పందించిన సోనూ.. పీఎస్‌4 లేకపోవడం నీ అదృష్టమని, పుస్తకాలు కొనిస్తాను చదువుకోమని సలహా ఇచ్చాడు. ‘నీ దగ్గర పీఎస్‌4 లేకపోతే నువ్వు అదృష్టవంతుడివి. బుక్స్ పంపిస్తా. నువ్వు వాటిని చదవాలి. నీ కోసం నేను ఇది చేస్తా’ అని సోనూ బదులిచ్చాడు. దీనికి బదులుగా నాలెడ్జ్ పెంచుకోవడానికి తప్పకుండా పుస్తకాలు చదువుతానని నీలేశ్ రిప్లయ్ ఇచ్చాడు. ఇది ట్విట్టర్‌‌లో షేర్ అయినప్పటి నుంచి 15 వేల లైక్‌లు వచ్చాయి. అలాగే 1,600 రీట్వీట్స్ రావడం విశేషం. ఈ ఇంటర్నెట్ జనరేషల్‌లో బుక్స్ విలువ తెలియట్లేదని, పిల్లలకు మీలాంటి సెలబ్రిటీలు సలహాలు ఇవ్వడం అమేజింగ్ అని ట్విట్టర్ యూజర్లు సోనూను మెచ్చుకుంటున్నారు.

Latest Updates