ఉద్యోగుల వేతనాల్లో కోతపై త్వరలో నిర్ణయం: హైకోర్టు

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం తగ్గిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ(మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది.

తగ్గించిన వేతనాలు, పింఛన్ల చెల్లింపులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోనుందని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈనెల 28లోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. అసెంబ్లీ సమావేశాలోపు పింఛనర్ల పై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామన్న హైకోర్టు… ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. పింఛనర్లకు బకాయి ఉన్న మొత్తం ఒకేసారి చెల్లించాలని సూచించింది. ఎక్కువ వాయిదాల్లో చెల్లిస్తే వారు ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడింది. బకాయి ఉన్న మొత్తానికి 12 శాతం వడ్డీతో చెల్లించాలని పిటిషనర్‌ తరఫు లాయర్ చిక్కుడు ప్రభాకర్‌ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ .. ముందు తగ్గించిన జీతం, ఫించను చెల్లించనీయండన్న హైకోర్టు…. విచారణను అక్టోబరు ఒకటో తేదీకి వాయిదా వేసింది.

Latest Updates