కరెంట్‌ బిల్లు చెల్లింపునకు త్వరలో కొత్త యాప్‌

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో కరెంట్ మీటర్ల రీడింగ్ నమోదును తెలంగాణ డిస్కమ్ లు వచ్చే నెలకు వాయిదా వేసింది. అయితే కరెంట్‌ బిల్లు చెల్లించేందుకు తెలంగాణ ఉత్తర డిస్కమ్ ఓ ప్రత్యేక యాప్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా మీటర్ రీడింగ్ ను ఫొటో తీసి పంపితే బిల్ జనరేట్ అవుతుందని డిస్కమ్ సీఎండీ అన్నమనేని గోపాలరావు తెలిపారు. వినియోగదారులు పాత బిల్ వచ్చిన తేదీ నుంచి సరిగ్గా 30 రోజులకు రీడింగ్ ను ఫొటో తీసి పంపితే బిల్ వస్తుందని… దాన్ని ఆన్ లైన్ లోనూ చెల్లించవచ్చని సూచించారు. అయితే ఇప్పటికే  ఇలాంటి విధానం ఢిల్లీలో అమల్లో ఉంది.

Latest Updates