త్వరలోనే లాక్ డౌన్ ను ఎత్తేస్తాము: ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసకున్నారు. కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ ను త్వరలోనే ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. లాక్ డౌన్ తో ఎలాంటి ఉపయోగం లేదని, వైరస్ ను అది అరికట్టలేదని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే ప్రజలంతా వైరస్ తో కలిసి జీవించాలని అన్నారు. సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నగదు బదిలీ చేశామని… ఇకపై ఎవరికీ సహాయం అందించలేమని తేల్చిచెప్పారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. లాక్ డాన్ కారణంగా దేశ ఆదాయం దారుణంగా పడిపోయిందని… ఇకపై నష్టాన్ని తట్టుకునే శక్తి పాక్ కు లేదని ఇమ్రాన్ తెలిపారు. పేదలకు సాయం చేసేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదని… అయినా ఎన్ని రోజులు ఆర్థిక సాయం చేయగలమని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అది విస్తరిస్తూనే ఉంటుందని… అందువల్ల దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచించారు ఇమ్రాన్.

Latest Updates