సెక్స్ రాకెట్ నడపుతున్న ఇండ్లపై ఎస్ వోటీ దాడులు

    నిర్వాహకులతో పాటు ఇద్దరు మహిళలు, విటులు అరెస్ట్

దిల్ సుఖ్ నగర్,వెలుగు: సరూర్ నగర్ పీఎస్ పరిధిలో పీ అండ్ టీ కాలనీలో సెక్స్ రాకెట్ నడుపుతున్న రెండు ఇండ్లపై ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వారిని సరూర్ నగర్ పీఎస్ కి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం..పీ అండ్ టీ కాలనీలో ఉన్న రెండు ఇండ్లల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ ఓ టీ పోలీసులు ఆ ఇండ్లపై సోదాలు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు , రూ.11,900 నగదును స్వాధీనం చేసుకున్నారు.

అలియాబాద్ కి చెందిన గణరాతి శ్రవణ్ (27)సరూర్ నగర్ లోని పీ అండ్ టీ కాలనీ లో 2 ఇండ్లను రెంట్ కి తీసుకుని కలకత్తా కు చెందిన ఓ మహిళ తో కలసి సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు.  దాడుల్లో పట్టుబడిన మరో ఇద్దరు మహిళలు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రికి చెందినవారని పోలీసులు తెలిపారు.విటులలో సరూర్ నగర్ కి చెందిన వ్యక్తి, రాజమండ్రి చెందిన వ్యక్తి ఉన్నట్టు ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టుబడ్డ ఆరుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామన్నారు. ఇల్లు రెంట్ కి  ఇచ్చే  ఓనర్లు పూర్తి వివరాలు సేకరించి తర్వాతే ఇవ్వాలని ఇన్ స్పెక్టర్  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెంట్ కి ఉంటున్న వారి తీరు పట్ల ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఇండ్లలో సెక్స్ రాకెట్ నడపటం, వాటిని పేకాట స్థావరాలుగా మార్చడం చేస్తే ఆ ఇండ్లను ఏడాది పాటు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

Latest Updates