గంగూలీ అనుకుంటే అయిపోద్ది

ఇండో-పాక్‌‌ క్రికెట్‌‌ సిరీస్‌‌లపై లతీఫ్‌‌

లాహోర్‌‌ : బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ తలుచుకుంటే ఇండియా, పాకిస్థాన్‌‌ మధ్య క్రికెట్‌‌ సంబంధాలు మళ్లీ మొదలవుతాయని పాక్‌‌ మాజీ కెప్టెన్‌‌ రషీద్‌‌ లతీఫ్‌‌ అన్నాడు. పాక్‌‌ టూర్‌‌ విషయంలో  కెప్టెన్‌‌గా 2004లో చొరవ తీసుకున్న గంగూలీ మరోసారి అదే పని చేస్తే పాకిస్థాన్‌‌ క్రికెట్‌‌ బోర్డు(పీసీబీ) పరిస్థితి మెరుగుపడుతుందన్నాడు. ‘ మాజీ క్రికెటర్‌‌గా, బీసీసీఐ ప్రెసిడెంట్‌‌గా గంగూలీ మాత్రమే పీసీబీని రక్షించగలడు. ఇండియా–పాక్‌‌ బైలేటరల్‌‌ సిరీస్‌‌లు మొదలయ్యే దాకా ఇరుదేశాల్లో పరిస్థితులు మెరుగుపడవు. ఇండియా, పాక్‌‌ క్రికెట్‌‌ ఫీల్డ్‌‌లో తలపడితే చూడాలని ప్రపంచమంతా కోరుకుంటుంది. 2004లో ఇండియా టీమ్‌‌ పాకిస్థాన్‌‌కు రావడం వెనుక కెప్టెన్‌‌గా గంగూలీ కీ రోల్‌‌ పోషించాడు. బీసీసీఐతోపాటు ప్లేయర్స్‌‌ను ఒప్పించాడు. టీమిండియాకు ఆ సిరీస్‌‌ మధుర జ్ఞాపకంగా మిగిలింది. పదేళ్ల తర్వాత శ్రీలంక రావడంతో పాకిస్థాన్‌‌ క్రికెట్‌‌కు కాస్త ఉపశమనం లభించింది. ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌లు లేకపోవడంతో  చాలా స్టేడియంలు పాడవుతున్నాయి’ అని లతీఫ్‌‌ అన్నాడు. 2004 పాక్‌‌ టూర్‌‌లో ఐదు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌ను 3–2తో గెలిచిన గంగూలీ సేన 2–1తో టెస్ట్‌‌ సిరీస్‌‌ను సొంతం చేసుకుంది.

Sourav Ganguly can help resume India-Pakistan bilateral cricket ties: Rashid Latif

Latest Updates