టీమిండియా పేస్ అటాక్ సూపర్: గంగూలీ

న్యూఢిల్లీ: ఫిట్‌నెస్ స్టాండర్డ్స్‌ను పెంచుకోవడంతో టీమిండియా పేస్ బౌలింగ్ పూర్తిగా మారిపోయిందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఫిట్‌నెస్‌తోపాటు బౌలింగ్ కల్చర్‌‌ను మార్చుకోవడంతో ప్రపంచంలో బెస్ట్ పేస్ అటాక్స్‌లో టీమిండియా ఒకటిగా తయారైందన్నాడు. మన టీమ్ పేస్ దళానికి స్పీడ్‌స్టర్స్‌ మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా బ్యాటరీలుగా మారారని మెచ్చుకున్నాడు. వీరి సాయంతో టీమిండియా సంప్రదాయ స్పిన్ బౌలింగ్‌ మీద ఆధారపడటం తగ్గిందన్నాడు.

‘ఇండియాలో కల్చర్‌‌ మారిపోయింది. ఇప్పుడు మనం మంచి ఫాస్ట్‌ బౌలర్స్‌పై డిపెండ్ అవ్వొచ్చు. ఫిట్‌నెస్ నియమాలు, ప్రమాణాలు పాటిస్తుండటం వల్ల ఫాస్ట్ బౌలర్లతోపాటు బ్యాట్స్‌మెన్‌ల స్థాయి చాలా మారిపోయింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ తాము ఫిట్‌గా ఉన్నామని అర్థం చేసుకోవడంతోపాటు నమ్ముతున్నారు. మనం ఫిట్‌గా, బలంగా ఉన్నాం కాబట్టి మిగతా వారిలా బౌలింగ్ చేయొచ్చని నమ్ముతున్నారు. మా జనరేషన్‌లో వెస్టిండీస్ ప్లేయర్లు చాలా బలంగా ఉండేవారు. మనం ఎప్పుడూ అంత బలంగా లేం. కానీ మనం స్ట్రాంగ్‌గా మారడానికి చాలా కష్టపడుతున్నాం. కానీ అది కల్చర్‌‌లో కూడా భాగంగా ఉండటం చాలా ముఖ్యం. ఏ టీమ్‌ కూడా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లతో ఓ స్పెషల్ ప్యాకేజీగా లేదనేది అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడే కాదు, క్రికెట్ హిస్టరీలో అలాంటి టీమ్ లేదు. ఒకవేళ అలా ఉంటే మాత్రం అదే వరల్డ్‌లో బెస్ట్ బౌలింగ్ ఎటాక్ అని చెప్పొచ్చు’ అని గంగూలీ పేర్కొన్నాడు.

Latest Updates