సచిన్ కొడుకు క్రికెట్ ఆడొద్దా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జైషా బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతుండటంతో వస్తున్న విమర్శలపై గంగూలీ రియాక్ట్ అయ్యాడు. ఆయన తండ్రి రాజకీయ నాయకుడని..జైషా కాదని అన్నాడు. జైషాను, తండ్రిని వేరుగా చూడాలన్నాడు. జైషాతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందన్నాడు. క్రికెట్ కు మంచి చేయాలనుకుంటున్న వ్యక్తి జైషా అని అన్నాడు.

శక్తివంతమైన వారి పిల్లలు ఏ పని చేసినా ఎందుకు విమర్శలు చేస్తారన్నారు. తల్లిదండ్రులను కాకుండా వారు చేసే పనిని చూడాలన్నారు.  సచిన్ క్రికెటర్ అయితే అతని కొడుకు అర్జున్ క్రికెట్ కావొద్దా అని ప్రశ్నించాడు. సచిన్ కొడుకు మంచి వాడా? లేదా అన్నది చూడాలి కానీ సచిన్ తో పోల్చొద్దన్నారు. ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ లో ఇలా ఉండదన్నారు. ఇపుడున్న చాలా మంది క్రికెటర్లలో రిలేషన్ షిప్ ఉన్నవారు…ఒకే కుటుంబానికి చెందిన వారున్నారని..దీన్ని వివాదం చేయకూడదన్నాడు గంగూలీ.

Latest Updates