ఇకపై ప్రతీ సిరీస్ లో ఒక పింక్ మ్యాచ్ ఆడాలి

ఇకపై ప్రతీ టెస్టు సీరీస్ లో ఒక  పింక్ బాల్ మ్యాచ్ ఆడితే బాగుంటుందన్నారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. అన్ని టెస్టులు సాధ్యం కాకపోయినా సిరీస్ ఒక్క మ్యాచ్ అయినా ఉండాలన్నారు. కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో  జరిగిన పింక్ బాల్ మ్యాచ్  తర్వాత తనకు చాలా ఆనందం వేసిందన్నారు. టెస్టుకు వచ్చిన జనాన్ని చూసి ఇది టెస్టు మ్యాచా? లేక టీ20 మ్యాచా? అనే సందేహం కల్గిందన్నారు. పింక్ బాల్ టెస్టుకు నాలుగు రోజుల ముందే  టికెట్స్ బుక్ అయిపోవడం ఆశ్చర్యం వేసిందన్నారు. ఎవరైనా 5 వేల మంది ముందు క్రికెట్ ఆడాలనుకోరన్నారు. ప్రేక్షకులు ఎక్కువ వస్తేనే బాగుంటుందన్నారు.

పింక్ బాల ్ టెస్టులు ఆడేందుకు మిగతా స్టేడియాలు రెడీగా ఉన్నాయన్నారు. కెప్టెన్ కోహ్లీ కూడా డైనైట్ టెస్టు బాగుంది కానీ ప్రతీ మ్యాచ్ డేనైట్ ఆడలేమని అన్నాడని దాదా చెప్పాడు. అయితే తన అభిప్రాయాలను బీసీసీఐ బోర్డుతో  చర్చించి ఫైనల్ డెసీషన్ చెబుతామన్నాడు.

Latest Updates