సౌతాఫ్రికా ఆలౌట్..భారీ ఆధిక్యంలో భారత్

ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో  275 పరుగులకే  సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది. దీంతో ఇండియాకు 326 పరుగుల అధిక్యం లభించింది. అంతకుముందు ఇండియా మొదటి ఇన్నింగ్స్ ను 601/5 పరుగులకు డిక్లేర్ చేసింది.  ఓవర్ నైట్ స్కోరు 36/3 వికెట్లతో మూడో రోజు బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా బ్యాటింగ్ లో తడబడింది.  డుప్లెసిస్ 64 పరుగులతో రాణించగా.. మిగతా బ్యాట్స్ మన్లు పెద్దగా రాణించలేకపోయారు. ఒక దశలో సౌతాఫ్రికా 200 పరుగులకే ఆలౌట్ అవుతుందనుకుంటుండగా ఫిలాండర్, కేశవ్ మహరాజ్ క్రీజులో పాతుకుపోయారు. కేశవ్ మహరాజ్ 74, ఫిలాండర్ 44 పరుగులతో రాణించగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. ఇండియా బౌలర్లు అశ్విన్  4, ఉమేశ్ యాదవ్ 3, షమీ 2, జడేజాకు ఒక వికెట్ పడ్డాయి.

Latest Updates