కనికా దిగిన హోటల్లోనే సఫారీ టీం

లక్నో: కరోనా పాజిటివ్‌‌గా తేలిన బాలీవుడ్​ సింగర్​కనికా కపూర్ ఉన్న​ హోటల్లోనే ఇండియా టూర్​కు వచ్చిన సౌతాఫ్రికా టీమ్​కూడా బస చేసిందన్న విషయం సంచలనం రేపుతోంది. మూడు వన్డేల సిరీస్‌‌  కోసం ప్రోటిస్ టీమ్ ఇటీవల​ ఇండియాకు వచ్చింది. అందులో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా.. రెండో  వన్డే కోసం సౌతాఫ్రికా జట్టు లక్నో చేరుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఓ న్యూస్ ​చానల్ ​నిర్వహించిన వార్షిక కాన్​క్లేవ్ ​మీటింగ్​లో పాల్గొనడానికి కనికా​అదే హోటల్లో దిగింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఆ హోటల్​లో ఉన్న కనికా.. అక్కడ భోజనం చేయడంతోపాటు పలువురు గెస్ట్​లను కూడా కలిసిందని సమాచారం. దీంతో ఆ టైమ్‌లో ఆమె ఎవరెవరిని కలిసిందనే దానికి సంబంధించి.. హోటల్​ సీసీటీవీ ఫుటేజీలను ఓ ఎక్స్ పర్ట్​బృందం పరిశీలిస్తోంది.

Latest Updates