సౌతాఫ్రికా గ్రాండ్‌ విక్టరీ

సెంచూరియన్‌‌: ఈ ఏడాదికి సౌతాఫ్రికా విజయంతో ముగింపు పలికింది. నాలుగు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఇంగ్లండ్‌‌తో జరిగిన ఫస్ట్‌‌ టెస్ట్‌‌లో 107 రన్స్‌‌తో గెలిచింది. ప్రొటీస్‌‌ నిర్దేశించిన 376 రన్స్‌‌ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇంగ్లండ్‌‌ 268కే ఆలౌటైంది. దీంతో  సిరీస్‌‌లో 1–0తో లీడ్‌‌లో నిలిచిన సౌతాఫ్రికా.. వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో పాయింట్ల ఖాతా కూడా తెరిచింది. ఓవర్‌‌నైట్‌‌ స్కోర్‌‌ 121/1తో నాలుగో రోజు, ఆదివారం సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ కొనసాగించిన ఇంగ్లిష్‌‌ జట్టును రబడ(4/103), నోర్జ్‌‌(3/56), కేశవ్‌‌ మహారాజ్‌‌(2/37) దెబ్బకొట్టారు. ఓవర్‌‌నైట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ బర్న్స్‌‌(84)ను ఔట్‌‌ చేసి నోర్జ్‌‌ తొలి బ్రేక్‌‌ ఇవ్వగా.. స్టోక్స్‌‌(14) వికెట్‌‌ తీసిన మహారాజ్‌‌ మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు. 15 బాల్స్‌‌లో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్​ చిత్తుగా ఓడింది.  డికాక్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు.

Latest Updates