పది పాసైనవారికి రైల్వేలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. RRB విభాగంలో మొత్తం 4వేల103 పోస్టులకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చని మరో ప్రకటన చేసింది రైల్వే.

అర్హత‌: 50 శాతం మార్కులతో ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వ‌యోపరిమితి: 08.12.2019 నాటికి 15-24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్, మెడిక‌ల్ ఫిట్‌నెస్‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పూర్తి వివరాలకు రైల్వే అఫీషియల్ వెబ్ సైట్ చూడవచ్చు.

మరిన్ని వార్తలు
పొగలో బతికేకంటే.. బాంబులేసి ఒక్కసారే చంపేయండి: కేంద్రంపై సుప్రీం ఫైర్
భార్య ఆత్మహత్య.. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్..

Latest Updates