ట్రాక్‌ల రిపేర్లల్లో దేశంలోనే రికార్డు  

లాక్​డౌన్‌ను వాడుకున్న ఎస్‌సీఆర్‌

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్​తో రైళ్లు రద్దవడంతో దొరికిన ఖాళీ టైమ్​ను దక్షిణ మధ్య రైల్వే సమర్థంగా వాడుకుంది. ట్రాకుల రిపేర్ పనుల్లో ఇండియన్​ రైల్వేస్​లోనే తొలి స్థానంలో నిలిచింది. జోన్​లో మరమ్మతులు చేయాల్సిన సెక్షన్లను గుర్తించి రైలు పట్టాలు, క్రాసింగ్​లు, స్లీపర్లు, బలాస్ట్​లను మెరుగుపర్చింది. జోన్​లో 984 కిలోమీటర్ల పట్టాలను బాగు చేశారు. పట్టాలు ఒక లైన్​ నుంచి మరో లైన్​కు మారేచోట, రెండు లైన్లు కలిసే చోట ఉండే క్రాసింగ్స్,​ పాయింట్స్​అలైన్​మెంట్​ను సరి చేశారు. రైలు పట్టాల కింద చెత్తను తీసి మంచి బలాస్ట్ నింపే పనులను 83 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. దీంతో రైళ్ల వేగాన్ని మరింత పెంచవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..

ఇవాళ కొండపోచమ్మ సాగర్‌‌‌‌కు నీళ్లు

 

Latest Updates