మోడీ టూర్: కొరియన్ పిల్లలు హైలైట్

  • మహాత్ముడికి ఇష్టమైన పాట.. కొరియన్ చిన్నారుల నోట

ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కొరియా టూర్ లో ఆ దేశ పిల్లలు హైలైట్ గా నిలిచారు. ఆయనకు కొరియా అధ్యక్షుడు మూన్ జీ ఇన్ ఇచ్చిన విందులో చిన్నారుల బృందం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విందు భోజనం చేస్తున్న సమయంలో అతిథులకు ఆ చిన్నారుల సుమధుర స్వరం వీనుల విందు చేసింది. మహాత్మా గాంధీకి అత్యంత ఇష్టమైన ‘వైష్ణవ జనతో తేనే కహియే జీ పీడ్ పరాయీ జానే రే..’ భజన గీతాన్ని పిల్లలు ఆలపించారు. విన సొంపుగా చిన్న పిల్లలు భారత ఆధ్యాత్మిక గీతాన్ని పాడుతుంటే అతిథులంతా పరవశులయ్యారు. బుసాన్ లోని ఇండియా కల్చరల్ సెంటర్ లో కొరియా అధ్యక్షుడు మూన్ ఈ విందును ఏర్పాటు చేశారు. భారత సంస్రదాయ దుస్తుల్లో ఆ చిన్నారులు గీతాలాపన చేయడం అందరినీ ఆకట్టుకుంది. కాగా, ఇవాళ ఉదయం మోడీని సియోల్ శాంతి బహుమతితో ఆ దేశం సత్కరించింది.

ఎంత అద్భుతంగా పాడారో..

దీనికి సంబంధించిన వీడియోను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ‘వైష్ణవ జనతో..’ పాటను కొరియన్ చిన్నారులు ఎంత అద్భుతంగా పాడారో కదా అని ఆయన పొగిడారు. కొరియన్ పిల్లలు పాడిన తీరుకు ట్విట్టర్ లో భారతీయులు ఫిదా అయ్యారు. సూపర్ సింగింగ్ అని, శభాష్ అంటూ పిల్లలను ప్రశంసించారు.

Latest Updates