ఇండియా బ్యాటింగ్..కుల్దీప్ ప్లేసులో నదీమ్

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.గత మూడె టెస్టుల్లో కూడా ఇండియానే టాస్ గెలవడం విశేషం. వరుస మ్యాచ్ లలో టాస్ ఓడటంతో సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ కు రాలేదు. అయినా టాస్ గెలవలేదు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు గాయం కావడంతో ఈ మ్యాచ్ లో నదీమ్ ను తీసుకున్నారు. నదీమ్ కు ఇదే మొదటి మ్యాచ్ . టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా ప్రస్తుతం 3 ఓవర్లకు 7 రన్స్ చేసింది. మయాంక్ 6, రోహిత్ శర్మ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Latest Updates