అత్యంత విష‌మంగా ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితి

కరోనా వైరస్ బారిన పడిన ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని తెలుస్తోంది. ‌ఆగస్ట్ 5న చికిత్స నిమిత్తం చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చేరిన బాలు.. 40 రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎలాంటి హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. బాలు ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఆసుపత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్యవేక్షిస్తున్న‌ట్లు తెలిపింది.

Latest Updates