మోడీ కార్యక్రమంలో ఎస్పీబాలుకు అవమానం

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  ప్రధాని మోడీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ నిర్వహించిన కార్యక్రమంలో తమకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

మహాత్మగాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీ ఆయన సిద్ధాంతాలను ప్రోత్సహించడానికి  అక్టోబర్ 29న  మోడీ ‘చేంజ్ విత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్  నుండి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్  అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. సౌత్ నుంచి చాలా మందికి ఆహ్వానం అందలేదు. టాలీవుడ్ నుంచి బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. 

అయితే ఈ కార్యక్రమానికి వెళ్లగానే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తమ సెల్ ఫోన్లు తీసుకుని ఒక టోకెన్ ఇచ్చారని అన్నారు బాలు. అయితే లోపలికి వెళ్లే సరికి చాలా మంది సెలబ్రిటీలు మోడీతో  సెల్ఫీలు తీసుకుంటున్నారని..ఈ ఘటన చూడగానే తనకు చాలా బాధకల్గిందన్నారు. ఇలా తమకు అవమానం కల్గిందని ఆవేదన వ్యక్తం చేశారు బాలు.

Latest Updates