ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స‌తీమ‌ణికి కరోనా పాజిటివ్

SP Balasubrahmanyam’s wife Savitri tests positive for COVID-19

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని.. ఐసీయూ వార్డుకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామ‌ని.. శుక్ర‌వారం ఆసుప‌త్రి వ‌ర్గాలు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నాయి. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉందని.. చికిత్స కు స్పందిస్తున్నార‌ని ఆయ‌న కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు.

అయితే తాజాగా బాల సుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రి కూడా కరోనా వైరస్ బారిన ప‌డిన‌ట్టు స‌మాచారం. కొన్నిరోజుల కిందటే బాల సుబ్రహ్మణ్యంకు వైరస్ సోకింది. ఇప్పుడు ఆయన భార్య కూడా కోవిడ్ బారిన పడ్డారు. బాలుకు పాజిటివ్ రావడతో కుటుంబ సభ్యులకు టెస్టులు నిర్వహించగా.. ఆయ‌న స‌తీమణి సావిత్రికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. బాల సుబ్రహ్మణ్యం భార్య కూడా ఇప్పుడు వైరస్ బారిన పడటం అభిమానులకు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Latest Updates