రేపు చెన్నైలోని రెడ్ హిల్స్ ఫామ్ హ‌జ్ లో బాలు అంత్య‌క్రియ‌లు

ఎస్సీ బాలసుబ్రమణ్యం మరణంతో సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు కుటుంబ సభ్యులు. చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన నివాసానికి ఇవాళ(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. రేపు(శనివారం) ఉదయం వరకు ఇంటి దగ్గరనే బాలు భౌతికకాయం ఉండనుంది. ఆ తర్వాత అభిమానులు సందర్శన కోసం శుక్రవారం ఉదయం సత్యం థియేటర్‌కు తీసుకెళ్లనున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పెద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తర్వాత చెన్నై శివారు రెడ్‌హిల్స్‌లోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చేసిన అంతిమయాత్ర రథం సిద్ధంగా ఉంచారు.

Latest Updates