SPకి 37…. BSPకి 38 : యూపీలో కుదిరిన సీట్ల పొత్తు

ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తులపై క్లారిటీ వచ్చింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 37 సీట్లలో, బీఎస్పీ 38 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటుపై మరోసారి చర్చించిన మాయావతి, అఖిలేష్ యాదవ్ చివరకు పొత్తులు ఖరారు చేసుకున్నారు. ఏయే లోక్ సభ స్థానాల్లో ఏయే పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపాలన్న విషయాన్ని కూడా క్లారిఫై చేశారు.

గత నిర్ణయం ప్రకారం చెరో 38 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నా… సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానాన్ని తగ్గించుకుని 37 సీట్లలో పోటీకి పరిమితమైంది. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు కాంగ్రెస్ కు వదిలిన ఎస్పీ-బీఎస్పీ… మరో మూడు సీట్లను అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ కు ఇచ్చింది. RLD మధుర, భాగ్ పట్, ముజఫర్ నగర్ నుంచి పోటీ చేయనుంది.

మాయావతి పార్టీకి సగం సీట్లు అవసరమా?: ములాయం

లక్నోలో సమాజ్ వాదీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన ములాయం సింగ్ యాదవ్… ఎస్పీ బీఎస్పీ పొత్తులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ విధానంతో మాయావతి పార్టీకి సగం సీట్లు కేటాయించారని తన కొడుకు అఖిలేష్ యాదవ్ ను ప్రశ్నించారు.

Latest Updates