బాలుడిని బైక్ పై కిడ్నాప్ చేసి.. రెండు గంటల్లోనే చంపేశారు

మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో  బాబు దీక్షిత్ రెడ్డి హత్య జరిగిందన్నారు SP కోటిరెడ్డి. తొందరగా డబ్బు సంపాదించాలనే దుర్భుద్దితోనే కిడ్నాప్ చేశారన్నారు. తెలిసిన వ్యక్తి కావడంతోనే దీక్షిత్ కిడ్నాపర్ తో వెళ్లాడని తెలిపారు. సీసీ కెమెరాల్లో పడకుండా బైక్ పై బాలుడ్ని  కిడ్నాపర్ తీసుకెళ్లాడని SP తెలిపారు. దానమయ్య గుట్టపైకి తీసుకెళ్లాక బాలుడ్ని కంట్రోల్ చేయడం మందసాగర్ కు కష్టమైందన్నారు ఎస్పీ. దీక్షిత్ ను మందసాగర్ గొంతు పిసికి చంపినట్లు తెలిపారు.  టెక్నాలజీ ఉపయోగించి కిడ్నాపర్ ను ట్రేస్ చేశామన్నారు. సాయంత్రం 6 గంటలకు కిడ్నాప్ చేసి  రాత్రి 8 గంటలలోపే హత్యచేశాడన్నారు. బాలుడు తనను గుర్తుపట్టాడనే కారణంతో గంటన్నరలోపే హత్య చేసినట్లు చెప్పారు.

ఆదివారం కిడ్నాప్ కు గురయ్యాడు దీక్షిత్. బాలున్ని వదిలిపెట్టాలంటే 45 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. బాలుడి పేరెంట్స్ అంత డబ్బు తమ దగ్గర లేదని చెప్పారు. అయితే కిడ్నాపర్లు బాలున్ని చంపేస్తామని బెదిరించారు. దీంతో దీక్షిత్  తల్లిదండ్రులు ఎలాగోలా డబ్బు సేకరించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కిడ్నాపర్లకు డబ్బు ఇచ్చి బాలున్ని విడిపించుకోవడానికి ప్రయత్నించారు. కిడ్నాపర్లు చెప్పిన మూడు, నాలుగు ప్రాంతాలకు తిరిగారు దీక్షిత్ తండ్రి. రాత్రంతా నిరీక్షించినా కిడ్నాపర్లు రాలేదు. ఇంటర్నెట్ కాల్స్ ద్వారా.. దీక్షిత్ తల్లిదండ్రులను కిడ్నాపర్లు బెదిరించినట్లు తెలుస్తోంది. తమను ఎవ్వరూ పట్టుకోలేరని.. బాలుడు గుర్తు పట్టినా ఏమీ చెయ్యలేరని… ఫోన్ కాల్ లో చెప్పినట్లు సమాచారం.

కిడ్నాప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 100మందితో 10 బృందాలు ఏర్పాటు చేసి.. చివరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే బాలున్ని చంపేశారు నిందితులు. మహబూబాబాద్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో బాలుడి డెడ్ బాడీ దొరికింది.

Latest Updates