10 లక్షలు దొంగిలించారు: అసెంబ్లీలో ఏడ్చేసిన ఎమ్మెల్యే

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ఉదయం సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే కల్పనాథ్ పాశ్వాన్ భోరున ఏడ్చేశారు. తాను చాలా పేదవాడినని, తనను ఆదుకోకుంటే ఆత్మహత్యే దిక్కంటూ విలపించారు.

అజంగఢ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇటీవల ఓ హోటల్ లో ఉండగా రూ.10 లక్షల సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే వారి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం లేదని ఆయన చెప్పారు.

‘చేతులు కట్టుకుని సభ మొత్తాన్ని ప్రార్థిస్తున్నా. నేను చాలా పేదోడిని. నా డబ్బు దొంగతనం జరిగిందంటే పోలీసులు పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు. నాకు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే నేను ఎక్కడికెళ్లాలి. డబ్బు రికవరీ చేసివ్వాలి. లేకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

దీనిపై స్పందించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా.. స్థానిక పోలీసుల నుంచి రిపోర్టు తెప్పించుకుని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. హోం శాఖ అధికారులతోనూ మాట్లాడుతానని చెప్పారు.

Latest Updates