లోక్ సభలో సారీ చెప్పిన ఎంపీ అజంఖాన్

బీజేపీ ఎంపీ రమాదేవీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు లోక్ సభలో క్షమాపణలు చెప్పారు ఎస్పీ ఎంపీ అజంఖాన్. గత వారం రోజులుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై లోక్ సభలో దుమారం రేగింది. అజంఖాన్  క్షమాపణలు చెప్పాల్సిందేనని మహిళా ఎంపీలు, బీజేపీ ఎంపీలు డిమాండ్  చేశారు. అయితే సోమవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ అజంఖాన్ మాట్లాడేందుకు సమయమిచ్చారు. అనంతరం అజంఖాన్ మాట్లాడుతూ.. తాను సభ ఉల్లంఘనలను ఏనాడు దాటలేదని..ఒక వేళ తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. తర్వాత స్పీకర్ మాట్లాడుతూ.. ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని..మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.

Latest Updates