హేమంత్ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదలం

హైదరాబాద్ : హేమంత్ హత్య కేసులో ఆయన భార్య అవంతి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఆరు గంటల పాటు ఆమె నుంచి వివరాలు తీసుకున్నారు. విచార‌ణ ముగిసిన తర్వాత అవంతి మీడియాతో మాట్లాడారు. త‌న భ‌ర్త హేమంత్ హ‌త్య కేసులో త‌న‌ను విచారించి స్టేట్ ‌మెంట్ రికార్డు చేశారు. త‌న‌కున్న అనుమానాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. త‌న‌కు ప్రాణ హాని ఉంది. త‌న భ‌ద్ర‌త‌పై పోలీసులు హామీ ఇచ్చారు. నిందితుల‌కు బెయిల్ రాకుండా పోరాటం చేస్తాను అన్నారు. మా మామ‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఆ కాల్స్ ఆడియోలు పోలీసుల‌కు అంద‌జేశామ‌ని తెలిపారు అవంతి.

హేమంత్ పరువు హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలేది లేదన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఇప్పటివరకు కేసులో 14 మందిని అరెస్ట్ చేశామన్నారు. యుగంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలను 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చిందన్నారు. హేమంత్ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోందన్నారు సజ్జనార్.

Latest Updates