స్పా సెంటరే వ్యభిచారం గృహం

  •                 ఎస్ఓటీ పోలీసుల దాడితో బట్టబయలు
  •                 నిర్వాహకులతోపాటు ఇద్దరు విటులు అరెస్ట్
  •                 ఎస్ఓటీ పోలీసుల దాడితో బట్టబయలు
  •                 నిర్వాహకులతోపాటు ఇద్దరు విటులు అరెస్ట్
  •                 రూ.1.36 లక్షల నగదు స్వాధీనం.. రెస్క్యూ హోంకు 6 బాధితులు

స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ఇద్దరిని మాదాపూర్​ఎస్ఓటీ పోలీసుల సహాయంతో కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్​చేశారు. రూ.1.36 లక్షల నగదు,  ఆరు సెల్​ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు యువతులను రెస్య్కూ హోంకు తరలించారు. కేపీహెచ్​బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్​పల్లికి చెందిన ఎ.కృష్ణ(23), ప్రగతినగర్​కు చెందిన సి.మౌనిక(26)తో కలిసి కేపీహెచ్​బీ కాలనీ రోడ్డు నెం.1, ఎంఐజీ59లోని ఫ్లాట్​ నెంబర్202ను అద్దెకు తీసుకున్నారు. యూనివర్సల్ హెయిర్​అండ్​స్పా సెంటర్​ను ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల తర్వాత ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం స్టార్ట్​చేశారు. జస్ట్ డయల్, సులేఖ యాప్​ల ద్వారా విటులను రప్పిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, కేపీహెచ్​బీ పోలీసులతో కలిసి శనివారం అర్ధరాత్రి దాటాక స్పా సెంటర్​పై దాడి చేశారు. విటులు కూకట్ పల్లికి చెందిన సింహాద్రి, కొండాపూర్​కు చెందిన గుణశేఖర్ లతో పాటు నిర్వాహకులు కృష్ణ, మౌనికలను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు యువతులను రెస్య్కూ హోంకు తరలించారు. రూ.1,36,160 నగదు, 6 సెల్​ఫోన్స్​ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు ఇన్​స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. 

 

Latest Updates