రాళ్ల రూపంలో కొకైన్‌ స్మగ్లింగ్

spanish-police-seize-tonne-of-cocaine-fake-stones

షూలో పెడితే పట్టుకున్నారు. ఎలక్ట్రిక్‌ సామాన్లతో పెడితే గుర్తుపట్టారు. లో దుస్తుల్లో ఉంచినా వదల్లేదు. ఇట్లైతే కుదరదనుకొని కొత్త ఐడియా వేశారు స్మగ్లర్లు. కృత్రిమ రాళ్లను తయారు చేసి, కొకైన్‌ పెట్టి తరలించాలని చూశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా టన్ను. మామూలుగా చూస్తే వాటిని రాళ్లే అనుకుంటాం. కానీ స్పెయిన్‌ పోలీసులు పసిగట్టేశారు. తమ దేశంలోకి స్మగ్లింగ్‌ చేస్తున్న ఆ టన్ను కొకైన్‌ను పట్టేసుకున్నారు. సుమారు 1.88 లక్షల కిలోల ఆ రాళ్లను ఓ పెద్ద రూంలోకి తీసుకెళ్లి పెద్ద పెద్ద సుత్తెలతో పగులగొట్టి కొకైన్‌ కవర్లను తీశారు. మొత్తం 785 ప్యాకెట్లున్నాయి. ఒక్కోటి కిలోకు పైనే బరువుంది. కొకైన్‌ను స్మగ్లింగ్‌ చేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. నిందితులంతా కొలంబియా, వెనెజులా వాళ్లని పోలీసులు చెప్పారు. ముందు స్పెయిన్‌కు, తర్వాత యూరప్‌ అంతా కొకైన్‌ సరఫరా చేసేందుకు వాళ్లు స్కెచ్‌ వేశారన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. రాళ్లను పగులగొట్టేందుకు ఖైదీలను తీసుకొస్తే బాగుంటుందని కొందరు కామెంట్లు చేశారు.

Latest Updates