కరోనా చైనాలో కాదు.. స్పెయిన్ లో పుట్టింది..!

కరోనా వైరస్ అందరూ అనుకున్నట్లుగా చైనాలో పుట్టలేదని, స్పెయిన్ లో పుట్టినట్లు సైంటిస్ట్ లు చెబుతున్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. 2019 డిసెంబర్ నెలలో చైనాలోని వుహాన్ వెట్ మార్కెట్ నుంచి కరోనా వైరస్ పుట్టిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆ వైరస్ చైనా లో పుట్టింది కాదని స్పెయిన్ లో పుట్టినట్లు ఆదేశానికి చెందిన బార్సిలోనా యూనివర్సిటీ సైంటిస్ట్ లు చెబుతున్నారు.

చైనాలో తొలికేసు బయట పడిన 41రోజుల తరువాత స్పెయిన్ లో నమోదైంది. దీంతో అక్కడి సైంటిస్ట్ లు జనవరి 2018 నుంచి 2019 డిసెంబర్ వరకు మురుగు నీటిపై పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో కరోనా వైరస్ జన్యువులు ఉన్నట్లు గుర్తించినట్లు అల్బర్ట్ బాష్ యూనివర్సిటీ తెలిపింది.

ఈ సందర్భంగా స్పానిష్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటరీ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జోన్ రామోన్ విల్లాల్బీ రాయిటర్స్ తో మాట్లాడుతూ కరోనా వైరస్ పై ఇంకా పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్పారు. మురుగు నీటిలో కరోనా ఉందని నిర్ధారించేందుకు పూర్తిస్థాయిలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందులో భాగంగా కరోనా వైరస్ జున్యువులున్నట్లు గుర్తించిన నమోనాల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు అందించామని, వీటిపై డబ్ల్యూహెచ్  స్పస్టత ఇవ్వాల్సి ఉందన్నారు.

Latest Updates