చిదంబరం రిమాండ్ పొడగింపు

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సీబీఐ కస్టడీ గడువు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది సీబీఐ స్పెషల్ కోర్టు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే తమ రిమాండ్ లో ఉన్న చిదంబరాన్ని… స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు అధికారులు. గడువు మరింత పొడిగించాల్సిందిగా కోరారు. సెప్టెంబర్ 2 వరకు చిదంబరాన్ని సీబీఐ రిమాండ్ అప్పగిస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది సీబీఐ స్పెషల్ కోర్టు.

సీబీఐ కోర్టుకు వచ్చినప్పుడు చిదంబరం ఉత్సాహంగా కనిపించారు. పార్టీ వర్కర్లకు, మీడియాకు చేతితో అభివాదం చేసి.. కోర్టుకు వెళ్లారు.

Latest Updates