సీబీఐ కస్టడీకి చిదంబరం

INX మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఆదేశాలు ఇచ్చింది. ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి కోరింది. అధికారులు కోరినట్టుగా 5 రోజుల పాటు కస్టడీ విచారణకు సీబీఐ కోర్టు అంగీకరించింది. ఆగస్ట్ 26 వరకు చిదంబరంను తమ కస్టడీలో ఉంచి ప్రశ్నించనుంది సీబీఐ.

ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిదంబరం ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారు. ఇవాళ (గురువారం) సాయంత్రం కస్టడీ ఆదేశాలు రావడంతో.. 23, 24, 25, 26 తేదీల్లో చిదంబరం ఇంటరాగేషన్ జరుగుతుంది.

సీబీఐ అడిగిన 12 ప్రశ్నలకు గతంలోనే చిదంబరం బదులిచ్చారని.. మళ్లీ కస్టడీ అవసరం లేదని కపిల్ సిబల్ వాదించారు. ఐతే.. మరిన్ని వివరాలు తెల్సుకోవాల్సి ఉందని సీబీఐ కోరడంతో.. కోర్టు అంగీకరించింది.

కుటుంబసభ్యులు, లాయర్లు రోజుకు 30 నిమిషాల పాటు చిదంబరంను కలిసి మాట్లాడే వీలు కల్పించింది సీబీఐ కోర్టు.

ప్రతి 2 రోజులకు ఒక్కసారి చిదంబరం ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పరిశీలించనున్నారు.

Latest Updates