గ్రేటర్లో కరోనా మృతులకోసం ప్రత్యేక శ్మశానాలు!

ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ర్ట ప్రభుత్వం
ఇప్పటికే స్థల సేకరణ కూడా పూర్తి
అన్ని మతాలకు ఒకే చోట వేర్వేరుగా నిర్మాణం
ప్రస్తుత శ్మశానాల్లో అంత్యక్రియలకు జనం అభ్యంతరాలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా మృతుల కోసం ప్రత్యేక శ్మశానాలను ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం స్థల సేకరణ కూడా పూర్తి చేసినట్టు తెలిసింది. కరోనాతో చనిపోయిన వారికి ప్రస్తుతం ఉన్నశ్మశానాల్లోఅంత్యక్రియలు జరుపుతుంటే స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. మరోచోట అంత్యక్రియలు జరపాలంటూ ఒత్తిళ్లువస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. దీంతో కరోనా మృతుల కోసం ప్రత్యేక శ్మశానాలను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుని అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా కరోనామృతుల కోసం ప్రత్యేక శ్మశానం ఏర్పాటు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిందని తెలిపారు.

గ్రేటర్ పరిధిలో రెండుశ్మశానాలు
జీహెచ్ఎంసీ పరిధిలో రెండు ప్రత్యేక శ్మశానాలు ఏర్పాటు చేయనున్నారు. బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు 4 ఎకరాల స్థలం గుర్తించారు. ఇక్కడ మూతపడిన కొన్ని పరిశ్రమల స్థలం ఖాళీగా ఉండటంతో శ్మశానం ఏర్పాటు చేసేందుకు మున్సి పల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇక హయత్ నగర్ ఏరియాలో మరో శ్మశాన వాటిక కోసం 10 ఎకరాల భూమిని గుర్తించారు.

అన్ని మతాలకు ఒకే చోట
ప్రత్యేక శ్మశానాల్లో ఒకే ప్రాంతంలో అన్నిమతాల సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఒక్కో మతానికి ఒక్కో చోట ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ శ్మశానాల్లో ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ప్రత్యేక సరిహద్దులు, జాగ్రత్తలు ఉంటాయని మున్సి పల్ శాఖలోని ఓ అధికారి వివరించారు. కరోనాతో చనిపోయిన వారి డెడ్బాడీలకు మాత్రమే ఇక్కడ అంత్యక్రియలకు అనుమతి ఉంటుందని తెలిపారు.

For More News..

వైరస్‌‌ కట్టడిలో ఢిల్లీ పద్ధతి బెటర్

ఓటర్లను తక్కువ చేసి చూడొద్దు

పులుల లెక్కలకు గిన్నిస్ గుర్తింపు

Latest Updates