సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు

ఆదిలాబాద్ సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేసింది. దోషులకు త్వరగా శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

అసిఫాబాద్‌ జిల్లాలోని ఎల్లాపటార్‌లో గత నెల 24న ముగ్గురు యువకులు దళిత మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హత్యచేశారు.

మరోవైపు అత్యాచార బాధితురాలు సమత భర్త టేకు గోపికి రెవెన్యూ శాఖలో అటెండర్ ఉద్యోగం కల్పించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని  జెడ్పి చైర్పర్సన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యే రేఖా నాయక్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు చేతుల మీదుగా గోపి అందుకున్నారు.

Latest Updates