దేవాదాయ భూములపై స్పెషల్ డ్రైవ్

ఈ నెల 17 నుంచి మార్చి 31 దాకా
సర్క్యులర్​ జారీ చేసిన కమిషనర్​ అనిల్

హైదరాబాద్, వెలుగు: కబ్జాకు గురైన దేవాదాయ భూములను గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకోవడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి మార్చి 31 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు శుక్రవారం ఆ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు.భూములను గుర్తించి ఫెన్సింగ్ వేస్తామన్నారు. భూములను కబ్జా చేసిన వాళ్లు వెంటనే సంబంధిత దేవాలయ కమిటీలకు హ్యాండోవర్ చేయాలని  సూచించారు. లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 13వేల ఆలయాలకు సుమారు 82 వేల ఎకరాల భూములుండగా.. వీటిలో సుమారు 20 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. భూరికార్డుల ప్రక్షాళనలో సుమారు వెయ్యి ఎకరాలను వెనక్కి తీసుకున్నారు.  ఆలయ భూములను ఆన్ లైన్ చేసి, దేవుడి పేరుతో పట్టాలు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates