వైర‌స్ ప్ర‌బ‌ల‌కుండా సూర్య దేవాలయంలో వైనతేయ హోమం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో ఈ ఆదివారం “వైనతేయ” హోమం జరిగింది.
సర్వజన సుభిక్షం కోసం ఆదిత్యుని సన్నిధిలో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జ‌రిగాయి. ఈ పూజ‌లు చేయడం వలన ” ఆపదుద్ధారణ” విష జ్వరాది ప్రాణాంతక రోగ నిర్మూలన జ‌రుగుతుంద‌ని, తద్వారా ప్రాణులకు స్వస్థత చేకూరుతుందని అర్చకులు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా దేశం సుభిక్షంగా ఉండాలని.. వైరస్ తగ్గుముఖం పట్టి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేక హోమాలను అరసవల్లి సూర్య క్షేత్రంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారు… ఈ మహమ్మారిని ప్రబలకుండా చేయాలని ఆకాంక్షిస్తున్నాను శంకరశర్మ పేర్కొన్నారు.

special homam in arasavalli suryanarayana swamy temple

Latest Updates