పిల్లల రక్షణకు ప్రత్యేక చట్టాలు

దేశంలో ఏదో ఒకచోట పసిమొగ్గలపై ఇలాంటి లైంగిక దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటా, బయటా పిల్లలపై లైంగిక వేధింపులు, భౌతిక దాడులు పెరుగుతున్నాయి. దాంతో మానసికంగా, శారీరకంగాఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు మన జాతి సంపద. బాల్యంలోని మధురానుభూతులు అందించే వాతావరణం కల్పించాలి. అది జన్మహక్కు కూడా. పిల్లల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి.

 

ప్రధాన హక్కులు…

సంపూర్ణ ఆరోగ్యం,నాణ్యమైన ఉచిత విద్య,ఆడుకోవడం, వినోదం, పరిశుభ్రమైన తాగునీరు, పోషకాహారం, గౌరవం, సమానత్వం,భావ వ్యక్తీకరణ,సమాన విద్యావకాశాలు, స్వేచ్ఛగా ఆలోచించడం,మానసిక,శారీరక వేధింపుల నుంచి విముక్తి,ప్రేమ,ఆప్యాయతలు,సామాజిక భద్రత.

ముఖ్య చట్టాలు…

పోక్సో చట్టం- 2012 : పద్దెనిమిదేళ్లలోపు పిల్లలపై లైం గిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయొచ్చు. నేరం రుజువైతే సాధారణ శిక్ష మొదలుకొని కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు, మరణశిక్ష విధించొచ్చు. పన్నెండేళ్ల బాలికలపై అత్యాచారం చేసిన కేసులో ఉరిశిక్ష విధించేలా పోక్సో చట్టాన్ని సవరించారు. గతేడాది హైదరాబాద్‌ పరిధిలో ఈ చట్టం కింది 579 కేసులు నమోదయ్యా యి.

బాల్యవివాహాల నిరోధక చట్టం- 2006: ఈ చట్టం ప్రకారం పద్దెనిమిదేళ్లలోపు బాలికలకు వివాహం చేయడం నేరం. బాల, బాలికలను వివాహం చేసుకున్నవ్యక్తులు.పెళ్లికి కారణమైన పెద్దలు, ఇరు కుటుంబసభ్యులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు.

బాలల న్యాయ పోషణ రక్షణ చట్టం- 2015 : ఈ చట్టం ద్వారా బాలికలు అవసరమైన రక్షణ, వసతి పొందొచ్చు. న్యాయసేవాధికార చట్టం -1987 : ఈ చట్టం ప్రకారం బాలబాలికలు న్యాయ సహాయం పొందటానికి అర్హులు.

ఆర్టికల్-24 : పద్నాలుగేళ్ల పిల్లలను కర్మాగారాల్లోకానీ, గనుల్లోకానీ, ఏ ఇతర అపాయకరమైన వృత్తుల్లో పని చేయిం చకూడదు.

ఆర్టికల్- 30 : పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో, గౌరవప్రదమైన, స్వేచ్ ఛాయుత పరిస్థితుల్లో,అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించాలి.

ఆర్టికల్-45 : బాలలకు ఉచిత నిర్బంధ విద్య

అంతేకాదు ..బాధిత పిల్లలు లేదా వారి తరపున పెద్దలు ఎవరైనా ‘నేషనల్‍ కమిషన్‍ ఫర్‍ ప్రొటెక్షన్‍ ఆఫ్‍ చైల్డ్ రైట్స్’ వెబ్ సైట్ లో నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. నమోదు ఫిర్యాదులపై దేశవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. బాలలు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిం చింది. లైం గిక వేధింపులను ధైర్యం గా ఎదుర్కొనేం దుకు ఈ వెబ్ సైట్‌ ఉపయోగపడుతుంది.

Latest Updates