మరో 3 నెలలు యెస్ బ్యాంక్‌‌కు స్పెషల్ లిక్విడిటీ విండో

న్యూఢిల్లీ : యెస్ బ్యాంక్‌‌‌‌కు స్పెషల్ లిక్విడిటీ విండోను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మరో మూడు నెలల పాటు పొడిగించింది. డిపాజిట్లు తగ్గడం వల్ల వాటిని కవర్ చేసేందుకు ఈ బ్యాంక్‌‌‌‌కు ఈ లిక్విడిటీ విండో పనిచేస్తుంది. బ్యాంక్‌‌‌‌లోకి వచ్చే తాజా డిపాజిట్ల కంటే బయటికెళ్తోన్న డిపాజిట్ల మనీ ఎక్కువుంటే, రూ.50 వేల కోట్ల లిక్విడిటీ విండో యాక్సస్ పొందవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. యెస్ బ్యాంక్‌‌‌‌పై విధించిన మారటోరియాన్ని ఎత్తివేసిన తర్వాత నుంచి ఈ స్పెషల్ లిక్విడిటీ విండోను రిజర్వ్ బ్యాంక్ అందించడం ప్రారంభించింది. ఈ పొడిగింపు లేకపోతే.. అంతకుముందు ఆఫర్ చేసిన ఈ లిక్విడిటీ విండో ఈ నెల 16తో ముగిసేది. కానీ ఈ స్పెషల్ విండోను మరో మూడు నెలలు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పొడిగించింది. బ్యాంక్‌‌‌‌ ఈ విండోను మార్చి, ఏప్రిల్ నెలలో డిపాజిటర్లకు మనీ తిరిగి చెల్లించేందుకు వాడినట్టు తెలిసింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో బ్యాంక్ మొత్తం డిపాజిట్లు రూ.2.09 లక్షల కోట్ల నుంచి రూ.1.65 లక్షల కోట్ల వరకు తగ్గాయి.

మార్చి 31 నాటికి ఈ డిపాజిట్లు మరింత తగ్గి రూ.1.05 కోట్లుగా, మే 2 నాటికి రూ.1.02 లక్షల కోట్లకు పడిపోయాయి. డిపాజిట్ల అవుట్‌‌‌‌ఫ్లో ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో బ్యాంక్ కార్పొరేట్, రిటైల్ డిపాజిటర్లు మళ్లీ బ్యాంక్‌‌‌‌లోకి వచ్చారని యెస్ బ్యాంక్ సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ చెబుతున్నారు. యెస్ బ్యాంక్ ప్రస్తుత కస్టమర్లు తమ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకుంటున్నారని, రిటైల్, హోల్‌‌‌‌సేల్‌‌‌‌ కస్టమర్లు కూడా కొత్తగా డిపాజిట్లు తెరుస్తున్నారని అన్నారు. అయినప్పటికీ, బ్యాంక్‌‌‌‌కు అర్జెంట్ లిక్విడిటీ అవసరాల కోసం ఈ స్పెషల్ లిక్విడిటీ విండోను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ అందిస్తోంది. ఈ విషయంపై యెస్ బ్యాంక్ కానీ, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కానీ స్పందించలేదు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రిక్వైర్‌‌‌‌‌‌‌‌మెంట్లను అందుకునేందుకు బ్యాంక్‌‌‌‌ తన రెగ్యులేటరీ క్యాపిటల్‌‌‌‌ను పెంచుకునేందుకు, కొత్తగా ఫండ్స్‌‌‌‌ను సేకరించాలని చూస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

 

Latest Updates