రక్షా బంధన్ కోసం స్పెష‌ల్ మైసూర్ పాక్

గోద్రేజ్ జెర్సీ విడుదల
హైదరాబాద్, వెలుగు : రక్షా బంధన్ వేడుకను అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు రుచికరమైన స్వీట్ తో సెలబ్రేట్ చేసుకునేలా గోద్రేజ్ జెర్సీ మైసూర్ పాక్ విడుదల చేసింది. జెర్సీ మైసూర్ పాక్ ను ఇండియనుల్ ఎక్కువ‌గా వంటకాలలో ఉపయోగించే, పౌష్టికాహారమైన స్వఛ్చ‌మైన ‌నెయ్యితో తయారు చేశారు. మైసూరు పాక్ ను సౌతిండియాలో ఎక్కువ‌గా స్వీట్ గా మాత్ర‌మే కాక, పండుగలను సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా వాడతారు. ఈ మైసూరు పాక్ 200 గ్రాములు రూ.120కు, 400 గ్రాములు రూ. 230కు లభిస్తుందని గోద్రేజ్ జెర్సీ తెలిపింది. గోద్రేజ్ జెర్సీ మైసూర్ పాక్ 45 రోజుల పాటు నిల్వ‌ ఉంటుందని పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates