గురుకుల విద్యార్ధులకు సమ్మర్ క్లాసులు

Special summer classes for Gurukula students in manchiriyal

వేసవి సేలవులు వృధా కాకుండా విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గురుకులాల్లో చదివే విద్యార్ధులకు ఉపయోగపడేలా… సమ్మర్ సమురాయ్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. మొబైల్ యాప్ తయారీ, డ్రోన్ కెమరా టెక్నాలజీతో పాటు.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పై స్టూడెంట్స్ కు కోచింగ్ ఇస్తున్నారు. వీటితో పాటు ఇంటర్ పూర్తయిన వారికి ఐఐటీ జేఈఈ, నీట్ లో సత్తా చాటేందుకు సబ్జెక్టులు బోధిస్తున్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో  విద్యార్థులకు సమ్మర్ సమురాయ్ పేరుతో వేసవి ప్రత్యేక శిక్షణా శిభిరాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. విభిన్న రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మొబైల్ యాప్ తయారీ, డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్, గేమ్స్ తయారీ పై ట్రైనింగ్ ఇస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 85 సమ్మర్ క్యాంప్ లు నిర్వహిస్తుండగా బెల్లంపల్లిలో రెండు క్యాంప్ లు ఏర్పాటు చేశారు. 800 మంది విద్యార్థులకు 18 మంది ట్రైనర్స్ తో కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గురుకులాల్లో ప్రతిభ ఉన్న ఇంటర్ విద్యార్థులను గుర్తించి 45 రోజుల పాటు ఐఐటి జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

Latest Updates