15, 29న వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

  • 16, 30 వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు కూడా

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు ఈ నెల 15, 29 వ తేదీల్లో ఉచిత దర్శనం కల్పిస్తామని టీటీడీ చెప్పింది. వీరి కోసం 4 వేల టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌‌కు వెయ్యి టోకెన్లు ఇస్తామంది. ఐదేళ్లలోపు చంటిపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఈ నెల 16, 30 వ‌‌ తేదీల్లో ఉద‌‌యం 9 నుండి మధ్యాహ్నం ఒకటిన్నవరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. గురువారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సర్వదర్శనానికి 2 గంటలు పడుతోంది. సాయంత్రం వరకు 51,338 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

Latest Updates