రాష్ట్రం నుంచి స్పెషల్‌‌‌‌ ట్రైన్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 8 న భువనేశ్వర్‌‌‌‌ నుంచి రాత్రి 11.20 గంటలకు రైలు బయలుదేరనున్నట్లు పేర్కొంది. ఇదే రైలు డిసెంబర్‌‌‌‌ 9న సికింద్రాబాద్‌‌‌‌లో రాత్రి 8 గంటలకు స్టార్ట్‌‌‌‌ అవుతుందని, జనవరి 2, 9 తేదీల్లో కాన్పూర్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌లో ‘కాన్పూర్‌‌‌‌ సెంట్రల్‌ – కాచిగూడ’ సూపర్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ వీక్లీ స్పెషల్‌‌‌‌ ట్రైన్‌‌‌‌ బయలుదేరుతుందని తెలిపింది. ఇదే రైలు జనవరి 3, 10 తేదీల్లో కాచిగూడలో రాత్రి 11.20 గంటలకు స్టార్ట్‌‌‌‌ అవుతుందని వెల్లడించింది.

special trains would run to different areas: SCR

Latest Updates