ట్రైబల్స్ ఆచారాలపై  యూఎస్ లో లెక్చర్​

ఓయూ ప్రొఫెసర్ కు ఆహ్వానం

హైదరాబాద్/ ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ అర్జునరావు కూతాడికి అపూర్వ గౌరవం దక్కింది . అమెరికాలోని ఒహియోలో ఉన్న షానీ స్టేట్ వర్సిటీ చరిత్ర విభాగం నిర్వహిస్తున్న ఎంజే ఫోస్టర్ డిస్టింగ్ విష్డ్ లెక్చర్ సిరీస్ లో తెలంగాణ గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు,ఆర్థిక పరిస్థితులు అనే  అంశంపై ప్రసంగం చేసే అవకాశం వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెంది న గిరిజన బిడ్డ అర్జునరావు.. ఓయూలో ప్రొఫెసర్​గా 22 సంవత్సరాలుగా విద్యార్థు లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జాతీయోద్యమంలో ప్రాంతీయ భాషా పత్రికల పాత్రపై డాక్టరేట్ అందుకున్న ఆయన 50కి పైగా జాతీయ, అంత ర్జాతీయ పత్రికలకు పరిశోధనా వ్యాసాలు రాశారు. ఇండియన్, సౌత్ ఇండియన్, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ లకు ఆయన  సేవలందించారు.

Latest Updates