మైనింగ్‌ పర్మిషన్లకు స్పెషల్‌ పాలసీ

Speed up sanctioning of mining permission: CS SK Joshi

సమీక్షలో సీఎస్‌ ఎస్​కే జోషి

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో మైనింగ్‌ పర్మిషన్లకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సీఎస్‌ఎస్‌కే జోషి అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి అటవీ, పర్యావరణ అనుమతుల తరహాలో మైనింగ్‌ పర్మిషన్లకు కన్సల్టెన్సీ సర్వీసులు అందించాలని సూచించారు. గురువారం సచివాలయంలో సీఎస్‌ ఎస్​కే జోషి, కేంద్ర ప్రభుత్వ మైనింగ్‌ అడిషనల్‌ సెక్రటరీ కె.రాజేశ్వర్ రావు వ్యూహాత్మక వార్షిక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మైనింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఖనిజాల తవ్వకాలకు సహకారం అందిస్తామని, లైమ్ స్టోన్ , మాంగనీస్, ఐరన్ ఓర్ , కోల్ తదితర ఖనిజాల అన్వేషణకు చర్యలు తీసుకుంటున్నామని రాజేశ్వర్ రావు తెలిపారు. రాష్ట్రం లో 3,291 లీజులు ఉన్నాయని,2018-–19 లో రూ.4,792 కోట్ల రెవెన్యూ సాధించామని జాయింట్ డైరెక్టర్ రఫీ అహ్మద్ చెప్పా రు. రాష్ట్ర మినరల్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్సూర్‌,ఆటామిక్ మినరల్ డైరెక్టర్ రమేష్ కుమార్, జీఎస్‌ఐ అడిషనల్‌ డీజీ శ్రీధర్ సమావేశంలో పాల్గొన్నారు.

Latest Updates