పేలిన స్పైస్ జెట్ విమానం టైరు..తప్పిన పెను ప్రమాదం

తిరుపతి ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం తప్పింది. స్పైస్ జెట్ విమానం ముంబై నుంచి హైదరాబాద్ మీదిగా తిరుపతి ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. అయితే ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యే సమయంలో స్పైస్ జెట్ విమానం టైరు పేలింది. టైరు పేలడాన్ని గమనించిన పైలెట్ చాకిచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పేలిన స్పైస్ జెట్ విమానం టైరును మార్చేందుకు ముంబై నుంచి టెక్నీషియన్లు రావాలని సిబ్బంది చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గమ్య స్థానాలకు ఎలా వెళ్లాలంటూ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల ఆందోళనతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు సత్వర చర్యలకు ఉపక్రమించారు.

 

Latest Updates