సోనూసూద్ కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం 

సోనూసూద్ కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం 

సినీ నటుడు నటుడు సోనూ సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు.  ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూ సూద్ అనే క్యాప్షన్ వేశారు.  ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే మొదటి సారి.  

లాక్ డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న కార్మికులను, విద్యార్థులను తన వంతు సాయం అందించారు. సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు.  రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు.  

స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోనూ సూద్ చాలా సంతోషంగా ఉన్నారు.  తనతో కలిసి లాక్ డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసిన సోనూ సూద్... ఇకపై కూడ ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానన్నారు.